- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.1.20 కోట్లతో భద్రాచలంలో 15 నూతన ట్రాన్స్‌ఫార్మర్లు..
ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే విధంగా రూ. 1.20 కోట్లతో 15 నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్,

దిశ, భద్రాచలం: ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే విధంగా రూ. 1.20 కోట్లతో 15 నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. సోమవారం భద్రాచలం సర్పంచ్ పూనేం కృష్ణ తో కలిసి నూతన ట్రాన్స్ఫార్మర్ లను వారు ప్రారంభించారు. సుభాష్ నగర్ కాలనీ, మెడికల్ కాలనీ, ఐటిడిఎ రోడ్, సెంట్ పాల్స్ స్కూల్ సమీపం, వెంకటేశ్వర కాలనీ, రాజుపేట కాలనీల్లో లో వోల్టేజ్ సమస్యను గ్రహించి 15 నూతన ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ రత్నం కవిత, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, పెద్దినేని శ్రీనివాస్, దారపునేని రాంబాబు, కొప్పుల శ్రీను, యూత్ నాయకులు గాడి విజయ్, మహిళ నాయకురాలు, అభిమానులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






