- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్రమణలను తొలగించి పునరుద్దరించండి.. ప్రజావాణిలో బీజేపీ నాయకుల అర్జీ
కోహెడ మండలం రామచంద్రా పూర్ పరిధిలో కుంటలు, వరద కాలువలు, శ్మశాన వాటిక, ఎస్ ఆర్ ఎస్ పీ కెనాల్ కాల్వలపై ఆక్రమణలను తొలగించాలని కక్కేర్ల దామోదర్ గౌడ్ ప్రజావాణిలో అర్జీ అందజేశారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కోహెడ మండలం రామచంద్రా పూర్ పరిధిలో కుంటలు, వరద కాలువలు, శ్మశాన వాటిక, ఎస్ ఆర్ ఎస్ పీ కెనాల్ కాల్పలపై ఆక్రమణలను తొలగించి, పునరుద్ధరించాలని కోరుతూ బీజేపీ ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు, రామచంద్రాపూర్ వార్డు సభ్యుడు కక్కేర్ల దామోదర్ గౌడ్ ప్రజావాణిలో అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ పరిధిలోని కుమ్మరి కుంట, శాలావానికుంట, పెతిరికుంట, దేవతల కుంట, స్మశాన వాటిక, కాలువలు ఆక్రమణకు గురైనట్లు తెలిపారు. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి హద్దు నిర్ణయించాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల అస్తీ పరిరక్షణలో సంబంధిత శాఖ అధికారులు వైఫల్యం చెంది ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ప్రజావాణిలో ఫిర్యాదు లు చేసిన అర్జీలను పట్టుకున్న చర్యలు లేక పోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కాలువల ఆక్రమణల పై ఫిర్యాదు చేసిన బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న కొహెడ ఇరిగేషన్ శాఖ ఏఈ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంటలు, కాలువలు, స్మశాన వాటిక కబ్జాలను తొలగించి పునరుద్ధరించి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు.






