బహ్రెయిన్‌లో విషాదం.. తెలంగాణ వాసి సముద్రంలో మునిగి మృతి!

by Ramesh Naini |

బహ్రెయిన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ వాసి శ్రీనివాస్ తోట సముద్రంలో మునిగి దుర్మరణం పాలయ్యారు.

బహ్రెయిన్‌లో విషాదం.. తెలంగాణ వాసి సముద్రంలో మునిగి మృతి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బహ్రెయిన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ వాసి శ్రీనివాస్ తోట సముద్రంలో మునిగి దుర్మరణం పాలయ్యారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో ఆయన నీటిలో మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.

అనంతరం ఈ విషాద ఘటన గురించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీనివాస్ 2019 నుంచి బహ్రెయిన్‌లోని మహమ్మద్ అహ్మద్ కో (MAC) సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల సంస్థ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సహోద్యోగులు, స్నేహితులు కూడా శ్రీనివాస్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story