- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే పర్యటనలో భారీ బందోబస్తు
కాంగ్రెస్ పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాల నేపథ్యంలో తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామెల్ పర్యటన సందర్భంగా ముందస్తు చర్యగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

దిశ, తుంగతుర్తి : కాంగ్రెస్ పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాల నేపథ్యంలో తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామెల్ పర్యటన సందర్భంగా ముందస్తు చర్యగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే సామెల్ వైఖరిని నిరసిస్తూ తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీలోని అసమ్మతి వర్గాలు ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడంతో పాటు అర్వపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసమ్మతి వర్గ నాయకులు ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, అలాగే పార్టీలోని ఒక వర్గం నుంచి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ బందోబస్తులో డీఎస్పీ ప్రసన్న కుమార్, నాగారం, తుంగతుర్తి సీఐలు నాగేశ్వరరావు, ఉపేందర్‌రావు, ఐదుగురు ఎస్‌ఐలు, 40 మంది పోలీసు సిబ్బంది, రెండు స్పెషల్ పార్టీలు పాల్గొన్నాయి.






