అవునూర్‌లో యూరియా కోసం రైతుల నిరీక్షణ !

by velandi.Saikiran |

అవునూర్ గ్రామంలోని వెంకటసాయి ఫర్టిలైజర్స్ వద్ద యూరియా కోసం బుక్ చేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించారు.

అవునూర్‌లో యూరియా కోసం రైతుల నిరీక్షణ !
X

దిశ, ముస్తాబాద్: అవునూర్ గ్రామంలోని వెంకటసాయి ఫర్టిలైజర్స్ వద్ద యూరియా కోసం బుక్ చేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించారు. కొండాపూర్, నామపూర్, గన్నేవానిపల్లె, మోర్రాపూర్, గోపాల్‌పల్లి, సేవాలాల్ తండా, ముస్తాబాద్ తదితర గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం ఉదయం నుంచే షాపు వద్ద వేచి ఉన్నప్పటికీ సరైన స్పందన లభించలేదని వాపోయారు.

రైతుల కథనం ప్రకారం

యూరియా బుక్ చేసుకున్నప్పటికీ "ఇతర ఎరువులు కూడా కొనాలి, లేకపోతే బుకింగ్ రద్దు చేసుకోండి" అంటూ షాపు యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా "ఇప్పుడు ఇవ్వం... సాయంత్రం రండి" అంటూ పలుమార్లు తిప్పుతున్నారని ఆరోపించారు. ఉదయం నుంచే రైతులు షాపు ఎదుట వేచి ఉన్నప్పటికీ షాపు తెరవకుండానే యాజమాన్యం వెళ్లిపోయిందని, నాలుగు గ్రామాల నుంచి వచ్చిన రైతులు యూరియా ఇవ్వాలని కోరినా స్పందించలేదని రైతులు పేర్కొన్నారు.అలాగే, "మీరు మా దగ్గర ఎందుకు బుక్ చేసుకున్నారు? మా గ్రామ రైతులకే యూరియా ఇస్తాం" అని యాజమాన్యం చెప్పినట్లు రైతులు ఆరోపించారు. మరోవైపు, యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఇచ్చిన బస్తాలకు రసీదులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తూ ప్రశ్నించగా మళ్ళీ రషీద్ లో దిద్దుతున్నట్లు రైతులు ఆరోపణ లు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను పరిశీలించాలని, యూరియాను నిబంధనల ప్రకారం రైతులకు అందుబాటులో ఉంచాలని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు

అవునుర్ గ్రామంలోని వెంకట సాయి ఫర్టిలైజర్ షాపులో పలు గ్రామాల రైతులు యూరియా కోసం బుక్ చేసుకున్నారని తెలిపారు వ్యవసాయ అధికారి అనూష ముస్తాబాద్. యూరియా బస్తాతో ఇతర ఎరువులు కొనాలంటే ఎలాంటి నిబంధనలు లేవని, ఒక్కో బస్తా 267 చొప్పున మాత్రమే తీసుకోవాలని నిబంధనల ప్రకారమే ఫర్టిలైజర్ షాపులు నడుచుకోవాలని అవినీతికి పాల్పడితే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు దగ్గర 300 చొప్పున బస్తాలు తీసుకున్నట్లు ఆరోపణలపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story