- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం జలాలను వెంటనే విడుదల చేయాలి
కన్నెపల్లి వద్ద మోటార్లను నడిపి కాలువల ద్వారా కాళేశ్వరం జలాలు అందివ్వాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ సోమవారం నిరసన ర్యాలీ చేపట్టింది.

దిశ, తుంగతుర్తి : కన్నెపల్లి వద్ద మోటార్లను నడిపి కాలువల ద్వారా కాళేశ్వరం జలాలు అందివ్వాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ సోమవారం నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్న కొద్ది జలాలను విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని మండి పడ్డారు. తద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రబీ సీజన్ కు సంబంధించి రైతు భరోసా బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆసరా పెన్షన్ రూ.4 వేలకు పెంచి కొత్తగా దరఖాస్తులను స్వీకరించాలని పేర్కొన్నారు. రైతులకు గుదిబండగా మారిన యూరియా యాప్ రద్దు చేయాలని, యూరియా అమ్మకాల పై దుకాణదారుల దోపిడీని అరికట్టాలని, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గుండగాని రాములు, తునికి సాయిలు, చింతకుంట్ల మనోజ్, తదితరులు పాల్గొన్నారు.






