సంస్థాన్ నారాయణపురం ఎస్సైగా సీతా పాండు బాధ్యతల స్వీకరణ

by Batti.Sumithra |

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సీతా పాండు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

సంస్థాన్ నారాయణపురం ఎస్సైగా సీతా పాండు బాధ్యతల స్వీకరణ
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సీతా పాండు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన జగన్ బదిలీ పై భువనగిరి సీసీఎస్‌కు వెళ్లారు. ఆయన స్థానంలో భువనగిరి వీఆర్ నుంచి సీతా పాండు సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై సీతా పాండు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థాన్ నారాయణపురాన్ని నేరరహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

Next Story