పెను సంచలనం.. పవన్ కల్యాణ్‌పై సుగాలి పార్వతీదేవి పోలీస్ కంప్లైంట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-06 09:24:22  IST  )

రాష్ట్రంలో సంచలన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు....

పెను సంచలనం.. పవన్ కల్యాణ్‌పై సుగాలి పార్వతీదేవి పోలీస్ కంప్లైంట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి(Sugarli Preeti Mother Parvathi Devi) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురి మరణం విషయంలో మోసం చేశారంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు గన్నవరం పోలీసుల(Gannavaram Police)కు ఆమె ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మరణాన్ని పవన్ కల్యాణ్ రాజకీయానికి వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌పై చీటింగ్‌తో పాటు నమ్మకద్రోహం, బహిరంగ విమర్శ, ఆదివాసీ బిడ్డ మరణంపై అసత్య ఆరోపణలు , నిందితులతో కుమ్మక్కైన విధానం, మొదటి సంతకం అంటూ మోసం చేసిన విధానంపై కేసులు నమోదు చేయాలని సుగాలి పార్వతీదేవి కోరారు.

ఒక్కోసారి ఒక్కోలా..

తన బిడ్డ సుగాలి ప్రీతి మరణంపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారని సుగాలి పార్వతీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతిని మానభంగం చేసి చంపేశారని ఓసారి మాట్లాడతారని, ఎలాంటి ఆధారాలు లేవని నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణపైనే చేస్తానన్న పవన్ కల్యాణ్ ఆ తర్వాత మాట మార్చారని సుగాలి పార్వతీ దేవి ఆరోపించారు. డీఎన్ఏ‌లు లేవని, నిందితులు లేరని, అసలు రేప్ జరగలేదని, సాక్ష్యాలు లేకపోతే ఏం చేస్తానంటున్నారని సుగాలి పార్వతీ దేవి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని అడిగినప్పుడల్లా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడతారని, జనసేన వాళ్లను ఉసిగొల్పుతారని ఆరోపించారు. ఆ వెంటనే జనసేన నేతలు తనపై దాడులకు దిగుతారన్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలని సుగాలి పార్వతీ దేవి డిమాండ్ చేశారు.

అసలు జరిగిందిదీ...

కాగా 2017లో కర్నూలులోని ఓ ప్రైవేటు స్కూల్లో సుగాలి ప్రీతి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించారు. దీంతో తల్లిండ్రులు స్కూలు కరెస్పాండెంట్ కుమారులపై అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురు సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి చంపారని తల్లి సుగాలి పార్వతీదేవి ఆరోపించారు. దీంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంతో తమకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్‌ను సుగాలి పార్వతీ దేవి కోరారు. దీంతో ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. దీంతో సుగాలి ప్రీతి మరణానికి న్యాయం జరగాల్సిందేనని తల్లి సుగాలి పార్వతీదేవి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. హోంమంత్రికి, డిప్యూటీ సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా న్యాయం జరగకపోవడంతో ఆమె సీరియస్ అయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Next Story