- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జిల్లా పరిధిలోని 65వ జాతీయ రహదారిపై సదాశివపేట బైపాస్ వద్ద నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు.

దిశ, సదాశివపేట: సంగారెడ్డి జిల్లా పరిధిలోని 65వ జాతీయ రహదారిపై సదాశివపేట బైపాస్ వద్ద నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను పట్టణ సీఐ వెంకటేశం ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిన్న జరిగిన ఈ ప్రమాదంలో ముబారక్‌పూర్ గ్రామానికి చెందిన రంజోల్ రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా 65వ జాతీయ రహదారిపై రహదారి భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ సీఐ వెంకటేశం ను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.






