- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరూర్ తొక్కిసలాట కేసులో ట్విస్ట్.. సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్
కరూర్ తొక్కిసలాట కేసు అనూహ్యంగా మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు పాలిటిక్స్‌లో సంచలనం సష్టించిన కరూర్ తొక్కిసలాట కేసు (Karur Stampede Case) సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, కేసులో సాక్షులను భయపెడుతూ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (DMK) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన వెకేషన్ బెంచ్ ఆ పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనుంది.
కాగా, గతేడాది సెప్టెంబర్ 27న టీవీకే చీఫ్ తలపతి విజయ్ (Thalapathy Vijay) కరూర్ వేదికగా నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుపుతోంది. అయితే, ఇటీవల ఎన్నికల్లో టీవీకే అఖండ విజయం సాధించి సీఎంగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న కొందరు కీలక నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట కేసులో బాధిత కుటుంబాలను మంత్రులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసేందకు ప్రయత్నిస్తున్నారంటూ విపక్ష డీఎంకే తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలను చేయడం తమిళ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.






