- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాని?
వెంకీ అట్లూరి తన తదుపరి మూవీని నానితో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న యువ దర్శకుల్లో వెంకీ అట్లూరి ఒకరు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.
దీంతో వెంకీ అట్లూరి కెరీర్ కాస్త నెమ్మదించింది. అలాంటి సమయంలో ధనుష్ హీరోగా రూపొందించిన 'సార్', దుల్కర్ సల్మాన్‌తో తెరకెక్కించిన 'లక్కీ భాస్కర్' చిత్రాలు వరుస బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకోవడంతో ఆయన మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఈ రెండు సినిమాలతో వెంకీ అట్లూరి క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయన సూర్య హీరోగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, వెంకీ అట్లూరి తన తదుపరి ప్రాజెక్ట్‌ను కూడా దాదాపు ఫైనల్ చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దర్శకుడు తన నెక్స్ట్ మూవీని నేచురల్ స్టార్ నానితో చేయనున్నట్లు, ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తైనట్లు సమాచారం. అలాగే ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాని ఒకవైపు 'ది ప్యారడైజ్' చిత్రంలో నటిస్తూనే, మరోవైపు సుజిత్ దర్శకత్వంలో రూపొందనున్న 'బ్లడీ రోమియో' సినిమాకు కూడా కమిట్ అయిన విషయం తెలిసిందే.






