- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో మహిళా హోంగార్డ్ మృతి
by Batti.Sumithra |
మందమర్రి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ గట్టక్క అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు.

X
దిశ, మందమర్రి : మందమర్రి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ గట్టక్క అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. సోమవారం ఆమె పార్థివ దేహానికి మందమర్రి సీఐ పర్స రమేష్, స్థానిక ఏఎస్సైలు మజీద్ ఖాన్, మిలన్‌లు గట్టక్క నివాసానికి చేరుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ పర్స రమేష్ ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పోలీసు సిబ్బందితో పాటు హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






