- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌కు ఊపిరిపోసిండు: మంత్రి సీతక్క
కష్ట సుఖాల్లో అండగా ఉండి పార్టీ అదికారంలోకి వచ్చే వరకు అవిశ్రంతంగా కృషి చేసి పార్టీకి ఊపరిపోసిన నాయకుడు మైల జయరాం రెడ్డి అని మంత్రి సీతక్క ఆయన సేవలను కొనియాడారు.

దిశ, మంగపేట: తెలంగాణ ఉద్యమ కాలంతో పాటు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మంగపేట మండల కాంగ్రెస్ అద్యక్షుడుగా పని చేసిన జయరాం రెడ్డి మండలంలో కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉండి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అవిశ్రంతంగా కృషి చేసి పార్టీకి ఊపరిపోసిన నాయకుడు మైల జయరాం రెడ్డి అని మంత్రి సీతక్క ఆయన సేవలను కొనియాడారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. జయరాం రెడ్డి 15 సంవత్సరాలగా మండల పార్టీ అధ్యక్షుడుగా పనిచేసి పార్టీ గడ్డు పరిస్థితిలో ముందుకు రాని సందర్బంలో పార్టీ బలోపేతానికి పని చేస్తూ అధికారంలో లేకున్నా నమ్మిన కార్యకర్తలను ఏనాడూ వదలని పట్టువదలని విక్రమార్కుడని కొనియాడారు. జయరాం రెడ్డి సేవలకు ముందు ముందు కాంగ్రెస్ పార్టీ సమచిత స్థానం కల్పించి ఆదుకుంటామని అన్నారు. ఈ సందర్బంగా జయరాం రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ మండల అద్యక్షుడుగా నాకు అవకాశం కల్పించిన ములగు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య, మంత్రి సీతక్క, నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండ్ర వెంకటరమణా రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, ములుగు జిల్లా మొదటి అద్యక్షుడు నల్లెల కుమారన్న, పైడాకుల అశోక్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ, బిక్షపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా, నియోజకవర్గం, బ్లాక్ మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






