మీరు వేట మొదలుపెట్టారు.. ప్రజలు ముగిస్తారు: ప్రకాశ్‌రాజ్ సంచలన వీడియో

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-06 07:09:46  IST  )

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'పై ఉపా (UAPA) చట్టం ప్రయోగించడంపై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు వేట మొదలుపెట్టారు.. ప్రజలు ముగిస్తారు: ప్రకాశ్‌రాజ్ సంచలన వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై అత్యంత కఠినమైన ‘ఉపా’ (Unlawful Activities Prevention Act) చట్టాన్ని ప్రయోగించడం పట్ల నటుడు ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా మరోసారి తన గళం విప్పుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌ను పరోక్షంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. వరుసగా ప్రభుత్వం ప్రశ్న రావణ్‌పై తప్పుడు కేసులు పెట్టిందని.. విచారణలో భాగంగా ఆ నాలుగు కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అన్యాయంగా UAPA వాడి ఓ యూట్యూబర్‌ను రిమాండ్ పంపుతారా? అహా జస్ట్ ఆస్కింగ్! అంటూ ఆయన ప్రశ్నించారు.

యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా.. వెరీగుడ్ అంటూ ఓ రేంజ్‌లో ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ వాగ్భానాలు సంధించారు. ఇది ప్రశ్నించే గొంతులను నొక్కడానికి కుట్ర అని అందరికీ స్పష్టంగా అర్థమైందని అన్నారు. ఇప్పటికే జనసైనికులు ప్రశ్న రావణ్ వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారని.. ఏఐ వీడియోలు, ఫోటోలతో ఫేక్ వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు ఎవిడెన్స్ కింద రావణ్ దగ్గర నుంచి తీసుకున్న ఫోన్ జనసైనికుల దగ్గర ఉందని.. అందులోని వ్యక్తిగత సమాచారాన్ని వక్రీకరించి తప్పుడు పనులు చేయిస్తూ దిగజారుతున్నారని.. ఇంకా దిగజారుతూనే ఉండండి అంటూ సెటైర్లు వేశారు. ‘ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారితో మీ ఆట మొదలైందని.. కానీ, ఈ ఆటకు ముగింపు ప్రజలే ఇస్తారు’ అంటూ ప్రకాశ్‌రాజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

జమ్మూకశ్మీర్‌లోని కిష్టవార్‌లో క్లౌడ్‌బరస్ట్‌.. బురద కింద చిక్కుకుపోయిన వాహనాలు (వీడియో)

Next Story