- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూకశ్మీర్‌లోని కిష్టవార్‌లో క్లౌడ్‌బరస్ట్.. బురద కింద చిక్కుకుపోయిన వాహనాలు (వీడియో)
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కిష్టవార్ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న ‘క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్’ (540 మెగావాట్లు) ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ క్లౌడ్‌బరస్ట్ (మేఘస్ఫోటనం) సంభవించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కిష్టవార్ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న ‘క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్’ (540 మెగావాట్లు) ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ క్లౌడ్‌బరస్ట్ (మేఘస్ఫోటనం) సంభవించింది.
ప్రాజెక్టు వద్ద ముంచెత్తిన బురద.. హైవే దిగ్బంధం
క్లౌడ్‌బరస్ట్ కారణంగా కొండచరియలు విరిగిపడి, భారీగా బురద, రాళ్లు ప్రాజెక్టు పరిసరాలను ముంచెత్తాయి. అక్కడ నిలిపి ఉంచిన ట్రక్కులు, ట్యాంకర్లతో సహా పలు వాహనాలు బురద కింద చిక్కుకుపోయాయి. భారీ యంత్రాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు, డోడా జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-కిష్టవార్ జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. రహదారిపైకి భారీగా శిథిలాలు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
రహదారిని పునరుద్ధరించేందుకు అధికారులు సిబ్బందిని రంగంలోకి దించారు. నష్ట తీవ్రతను అంచనా వేస్తూనే, శిథిలాలను తొలగించే పనిని వేగవంతం చేశారు.
జమ్మూకశ్మీర్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. కొండ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ (హఠాత్తుగా వచ్చే వరదలు), కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Red Alert : ముంబై, థానేలకు రెడ్ అలర్ట్.. హెచ్చరించిన భారత వాతావరణ శాఖ






