అడ్డాకుల టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

by Kodari Anjali |

అడ్డాకుల మండల కేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించాడు.

అడ్డాకుల టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
X

దిశ, అడ్డాకుల: మండల కేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాటవరం గ్రామానికి చెందిన ఎరుకలి బాబు (బాలయ్య) (35) అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం, సోమవారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్‌పై ప్రయాణిస్తున్న ఎరుకలి బాబు (బాలయ్య)తో పాటు మరో వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎరుకలి బాబు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు అడ్డాకుల ఎస్సై మురళి తెలిపారు. మృతుడు టోల్ ప్లాజా సమీపంలో చిన్న హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మురళి తెలిపారు.

Next Story