- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రికి ఆర్టీసీ బస్సు...
నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సులో ప్రయాణీస్తున్న ఓ మహిళ సొమ్మసిల్లటంతో ఆ బస్సు డ్రైవర్ ఔదార్యంతో సకాలంలో ప్రాథమిక చికిత్స పొంది, కొద్ది సేపటికి కోలుకుంది.

దిశ, నేలకొండపల్లి : నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సులో ప్రయాణీస్తున్న ఓ మహిళ సొమ్మసిల్లటంతో ఆ బస్సు డ్రైవర్ ఔదార్యంతో సకాలంలో ప్రాథమిక చికిత్స పొంది, కొద్ది సేపటికి కోలుకుంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై బస్సులోని ప్రయాణీకులతో పాటు, స్థానికులు కూడా ప్రశంశలు కురిపించారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే కోదాడ డిపో కు చెందిన టీజీ 29 జడ్ 0054 నెంబర్ గల్గిన బస్సు కోదాడ నుంచి బయలు దేరి ఖమ్మం వెళ్తుంది. కోదాడ బస్టాండ్ లోనే సుమారు 120 మంది ప్రయాణీకులతో కిక్కిరిసిన బస్సు నేలకొండపల్లి కూడలి కి రాగానే అందులో ప్రయాణీస్తున్న మహబూబాబాద్ జిల్లా, ఏజర్ల మండలం కు చెందిన ఎలగం కేతమ్మ అనే మహిళ సొమ్మసిల్లి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఇది గమనించిన తోటి ప్రయాణీకులు కండక్టర్, డ్రైవర్ కు విషయం తెలియజేశారు. అప్పటికే నేలకొండపల్లి స్టేజీ దాటి సహకార బ్యాంకు సమీపంలోకి బస్సు వెళ్ళటం తో బస్సును ఆపి ఆటో కోసం ప్రయత్నించారు. అయినా స్పందన లేకపోవటంతో డ్రైవర్ ధరావత్ రమేష్ నాయక్ బస్సును 350 మీటర్లు వెనక్కి నడిపి నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి మహిళ ను తరలించారు. ఇంతలో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. కాసేపటి కోలుకున్న మహిళ తో పాటు, ప్రయాణీకులు, ప్రజలు బస్సు డ్రైవర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.






