- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లు రాయించుకొని అడ్డం తిరిగిన ప్రబుద్ధుడు...
నీకు నాకు సంబంధం లేదని అమ్మను బాండ్ పేపర్ రాసివ్వాలంటూ ఓ కొడుకు పెట్టే టార్చర్‌కు తల్లి చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించారు.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: పాల్వంచ పట్టణం పాత పాల్వంచ ఏరియాకు చెందిన కొట్టు ఈశ్వరి, కొట్టు బాబూరావులకు ఇద్దరు కొడుకులు కొట్టు రాజు, కొట్టు రవితేజ, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. అయితే చిన్న కుమారుడు కొట్టు రవితేజ ఫ్లెక్సీ షాప్ నిర్వహిస్తూ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడటంతో కొడుకును రక్షించుకోవాలని అప్పులు చేశారు. కానీ విధి వక్రించి అతను మరణించాడు. మిగిలింది పెద్ద కొడుకు ఒక్కడే కదా అని అతను చెప్పినట్లు అమ్మ నమ్మింది. ఆస్తి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే తమ్ముడి ఆరోగ్యం బాగుకోసం చేసిన అప్పులన్నీ తీర్చేస్తా అంటూ నమ్మించాడు. అప్పటికి భర్త పెద్ద కొడుకు మాట నమ్మవద్దని వారించాడు. అయినప్పటికీ భర్త మాట వినకుండా తనకు కట్నంగా ఇచ్చిన ఇంటిని ఆ తల్లి రిజిస్ట్రేషన్ చేసింది. దీంతో కోపంతో భర్త ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ తర్వాత అప్పులు కట్టు కొడకా ...! అని పెద్ద కొడుకును బతిమిలాడితే.. నీవెవరు, నీకు నాకు సంబంధం లేదని బాండ్ పేపర్లో సంతకం పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని, తనకు జరిగిన అన్యాయం గురించి సోమవారం గ్రీవెన్స్ కలెక్టర్ అంకిత్‌కు తన బాధను వెళ్లగక్కింది. మా అమ్మ నాన్నలు నాకు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తిరిగి నాకిచ్చేలా, నా కొడుకుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరింది. స్పందించిన కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులకు ఎండార్స్ చేశారు.






