- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశుధ్య నిర్వహణపై స్పెసెల్ డ్రైవ్
by velandi.Saikiran |
పారిశుధ్య నిర్వహణపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ డాక్టర్ వెంకట మణి కరణ్ సిబ్బందిని హెచ్చరించారు,

X
దిశ, దుండిగల్: పారిశుధ్య నిర్వహణపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ డాక్టర్ వెంకట మణి కరణ్ సిబ్బందిని హెచ్చరించారు, దుండిగల్ సర్కిల్ శంభిపూర్ లో సోమవారం శానిటేషన్ పై స్పెసెల్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వన్ డే వన్ వార్డు పర్యటన కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.తడి చెత్త పొడి చెత్త వేరుచేసి స్వచ్ ఆటోల లో వేయాలన్నారు.రోడ్డు పక్కన చెత్తవేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే రోగాలు దరిచేరవన్నాడు.ఈ కార్యక్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డిప్యూటీ ఇంజనీర్ అన్వేష్ రెడ్డి,అసిస్టెంట్ ఇంజనీర్ అశోక్ కుమార్,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సాత్విక్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






