దిశ రిపోర్టర్ కు విఆర్ కాలేజ్ యాజమాన్యం బెదిరింపులు

by Taduka Kalyani |

వీఆర్ కాలేజీ పై మౌనం.. అనుమతులు నిల్.. ఫీజులు ఫుల్ అనే వార్త ‘దిశ’ పేపర్ లో ఆదివారం ప్రచురితం అయింది.

దిశ రిపోర్టర్ కు విఆర్ కాలేజ్ యాజమాన్యం బెదిరింపులు
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ వీఆర్ కాలేజీ పై అధికారుల మౌనం.. అనుమతులు నిల్.. ఫీజులు ఫుల్ అనే వార్త ‘దిశ’ పేపర్ లో ఆదివారం ప్రచురితం అయింది. కాగా వీఆర్ కాలేజీ మేనేజర్ వంశీ పటేల్ అబ్దుల్లాపూర్ మెట్ రిపోర్టర్ కి ఫోన్ చేసి మా కాలేజీ పైన వార్త ఎలా రాస్తావు మా వెనకాల చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అంటూ ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు.

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి : వెంకయ్య నాయక్ వివరణ

అబ్దుల్లాపూర్ మెట్ మండలం అంబర్పేట పరిధిలోని కుంట్లూర్ రోడ్ లో అక్రమంగా వెలసిన వి ఆర్ కాలేజ్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదని తక్షణమే ఆ కాలేజీ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అన్నారు.

Next Story