- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాలాగూడ రైల్వే పట్టాల వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం..
by Taduka Kalyani |
సికింద్రాబాద్–లాలాగూడ డౌన్ లైన్ రైల్వే మార్గంలోని కిలోమీటర్ నెంబర్ 195/54-56 మధ్య సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు.

X
దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్–లాలాగూడ డౌన్ లైన్ రైల్వే మార్గంలోని కిలోమీటర్ నెంబర్ 195/54-56 మధ్య సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 7.05 గంటలకు ముందు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అనారోగ్యం లేదా ఇతర సహజ కారణాల వల్ల మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడికానున్నాయి. మృతుడు గ్రే రంగు కోటు, బిస్కెట్ రంగు చొక్కా, నీలం రంగు గీతల లుంగీ ధరించి ఉన్నాడు. అతని కడుపు భాగంలో మచ్చ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 94400 83160 లేదా 87126 58581 నంబర్లకు సమాచారం అందించాలని ప్రభుత్వ రైల్వే పోలీసులు ప్రజలను కోరారు.
Next Story






