- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి భారీ ఆర్థిక సాయం.. చెక్కు అందజేత
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది...

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్(Krishnalanka Police Station)లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్(Gade Saikrishna custodial death)కు గురైన విషయం తెలిసిందే. అయితే సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ(Ycp) అండగా నిలిచింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి(Saikrishna mother Vijayalakshmi)కి రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో సాయికృష్ణ నివాసానికి వెళ్లిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు విజయలక్ష్మిని పరామర్శించారు. విజయలక్ష్మికి రూ.20 లక్షల చెక్కును అందజేశారు.
కృష్ణలంక పీఎస్‌లో లాకప్ డెత్
కాగా రౌడీషీటర్ సాయికృష్ణ విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో లాకప్ డెత్‌కు గురయ్యారు. మార్కాపురం నుంచి కృష్ణలంక పీఎస్‌కు సాయికృష్ణను తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సాయికృష్ణ మాయం అయ్యారు. దీంతో తల్లి విజయలక్ష్మి అనుమానం వచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టు తిరిగారు. అక్కడ నుంచి విశ్రమ సమాధానం వచ్చింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు.
వెలుగులోకి అసలు విషయం..
తదనంతర పరిణామాలతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాయికృష్ణ లాకప్ డెత్‌కు గురయినట్లు స్పష్టమైంది. ఇందుకు సీఐ నాగరాజునే కారణమని తేలింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
కొడుకు బూడిద కోసం..
అయితే సాయికృష్ణ మృతదేహాన్ని అయిన ఇవ్వాలని, లేనిపక్షంలో బూడిదైనా ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే పోలీసులు నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు. సాయికృష్ణ మృతదేహం ఎమైందనే విషయాలు ఇప్పటికీ తెలియదు. దీంతో ఆమె ప్రతి రోజూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి బూడిదైనా ఇస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని వేడుకుంటున్నారు.
అండగా వైసీపీ నేతలు
మరోవైపు ఆమెకు వైసీపీ నేతలు అండగా నిలిచారు. ఇంతటి దీన బాధల్లో ఉన్న ఆమెకు భరోసారి ఇచ్చారు. ఆర్థిక సాయంగా రూ. 20 లక్షలు అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఇచ్చారు.






