ప్లాస్టిక్ కాగితాలకు (కవర్లకు) భలే గిరాకీ

by Batti.Sumithra |

వర్షం కురిసిన తడవ కుండా ఉండేందుకు అవసరమైన ప్లాస్టిక్ కాగితాలను( కవర్లను) రైతులు రైతు కూలీలు జోరుగా కొనుగోలు చేస్తున్నారు.

ప్లాస్టిక్ కాగితాలకు (కవర్లకు) భలే గిరాకీ
X

దిశ, లింగంపేట : వర్షం కురిసిన తడవ కుండా ఉండేందుకు అవసరమైన ప్లాస్టిక్ కాగితాలను( కవర్లను) రైతులు రైతు కూలీలు జోరుగా కొనుగోలు చేస్తున్నారు. గత మూడు రోజులుగా లింగంపేట మండలంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ వరి నాట్లు మండలంలో ప్రారంభమయ్యాయి. దాంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు కూలీలు ప్లాస్టిక్ కాగితాలను జోరుగా కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ పనులు, వరినాట్లు వేసే సమయంలో వర్షం కురిస్తే తడవకుండా ఉండేందుకు మహిళలు ప్లాస్టిక్ కాగితాలను వినియోగిస్తారు. వ్యవసాయ పనులు చేసే సమయంలో గొడుగులను వినియోగించడం సాధ్య పడనందున వ్యవసాయ దారులు, రైతు కూలీలు అనువుగా ఉండే ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వాడుతుంటారు.

తల నుంచి మోకాళ్ళ వరకు ఉండే ప్లాస్టిక్ కాగితాలను కప్పు కోవడం వలన ఎంత వర్షం కురిసిన మహిళలు తడవ కుండా ఉండడంతో పాటు వరినాట్లు సాఫీగా సాగుతాయని, అందుకే కూలీలు ప్లాస్టిక్ కాగితాలను విని యోగిస్తుంటారని ఆయా గ్రామాల రైతులు చెప్తున్నారు. లింగంపేట మండల కేంద్రంలో కొందరు వ్యక్తులు రోడ్ల పక్కనే ప్లాస్టిక్ కాగితాలను విక్రయిస్తున్నారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు వ్యవసాయ కూలీలు జోరుగా కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో వర్షం కురిస్తే తడవకుండా ఉండేందుకు అవసరమైన ప్లాస్టిక్ కాగితాలను గ్రామీణ ప్రజలు కొనుగోలు చేస్తుండడంతో విక్రయదారులకు బాగా గిరాకీ అవుతోంది.

Next Story