రావి ఆకు పై ఎమ్మెల్యే చిత్రపటం

by Batti.Sumithra |

మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాస బాల్‌కిషన్ వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు.

రావి ఆకు పై ఎమ్మెల్యే చిత్రపటం
X

దిశ, మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాస బాల్‌కిషన్ వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినం సందర్భంగా ఆయన రావి ఆకుపై ఎమ్మెల్యే చిత్రపటాన్ని అత్యంత సూక్ష్మంగా, నైపుణ్యంతో చిత్రీకరించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్న రావి ఆకుపై ఎంతో చక్కగా, సూక్ష్మంగా చిత్రించిన చిత్రాన్ని చూసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాస బాల్‌కిషన్ కళా ప్రతిభను అభినందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కళపై తనకున్న అభిరుచిని, ఎమ్మెల్యేపై తన అభిమానాన్ని వినూత్నంగా ఆవిష్కరించిన బాస బాల్‌కిషన్ చొరవకు స్థానికులు, కళాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story