వ్యవసాయ బావి లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం..

by Taduka Kalyani |

వ్యవసాయ బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

వ్యవసాయ బావి లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం..
X

దిశ, కుల్కచర్ల: వ్యవసాయ బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుల్కచర్ల ఎస్ ఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామానికి చెందిన ఉప్పు సోమలింగం యొక్క వ్యవసాయ బావిలో సోమవారం వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియజేశామన్నారు. విషయం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా వ్యక్తి మృతి చెంది సుమారు నాలుగైదు రోజులు అయి ఉంటుందని అతని వయస్సు సుమారు 30-35, నల్లని రంగు లోదుస్తులు ఎర్రని బనియన్ ఉన్నాయన్నారు. మృతి చెందిన వ్యక్తి చేతికి, కాళ్ళకి చేపల వల ఉందన్నారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం పరిగి ఆసుపత్రికి తరలించామన్నారు.

Next Story