ఆ స్టార్ హీరోతో నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను: ఐశ్వర్య రాజేష్

by Mallepaka Hamsa |

తనకు కేవలం 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక సినిమాలో ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో నటించానని ఐశ్వర్య రాజేష్ వెల్లడించారు.

ఆ స్టార్ హీరోతో నటించి  ఎన్నో విషయాలు నేర్చుకున్నాను: ఐశ్వర్య రాజేష్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమాలో హిట్ అందుకొని అదే జోష్ కొనసాగిస్తూ వరుస చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. త్వరలోనే ‘ఓ సుకుమారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తిరువీర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక చక్కటి రూరల్ రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ డ్రామాగా రాబోతుండగా.. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా ముగించే పనిలో బిజీగా ఉంది. జూలై 17న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన కెరీర్ ఆరంభంలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. తనకు కేవలం 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక సినిమాలో ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో నటించానని ఐశ్వర్య రాజేష్ వెల్లడించారు.

ఆ చిత్రం మరేదో కాదు.. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో, విరుమాండి దర్శకత్వంలో కేజెఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై వచ్చిన 'కా పే రణసింగం'. ఆ సమయంలో అంత చిన్న వయసులో తల్లి పాత్ర చేయడం పెద్ద సాహసమే అయినప్పటికీ, ఆ రోల్ చేయడానికి స్టార్ హీరో విజయ్ సేతుపతి గారే తనను ఎంతగానో ప్రోత్సహించారని ఆమె తెలిపారు. అప్పట్లో ఆ పాత్రను తాను చేయగలనని విజయ్ సేతుపతి తనపై ఎంతో నమ్మకం ఉంచారని ఐశ్వర్య పేర్కొన్నారు. నిజానికి ఆ సమయంలో తాను గొప్ప నటిని ఏమీ కాదని, ఆ క్యారెక్టర్‌లో ఎలా లీనమవ్వాలి, ఎలా నటించాలి అనే విషయాలను విజయ్ సేతుపతి దగ్గరుండి మరీ నేర్పించారని ఆమె కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. దాదాపు ఆరేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా విశేషాలను, నాటి షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story