- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవిష్యత్తులో ఎల్కతుర్తి మరింత అభివృద్ధి
మండలం భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

దిశ ఎల్కతుర్తి: మండలం భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 13 కోట్లతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కుడా వైస్ చైర్‌పర్సన్ & హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీలతో కలసి సోమవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాలకు మండల కేంద్రానికి రహదారి అనుసంధానం ( కనెక్టివిటీ) పెరుగుతుందన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రానికి కోర్టు, విద్యుత్ ఉపకేంద్రం, తహసీల్దార్ కార్యాలయాలు వస్తున్నాయన్నారు. తద్వారా ఎల్కతుర్తి మరింత అభివృద్ధిని భవిష్యత్తులో సాధిస్తుందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ రహదారి నిర్మాణం ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రహదారి నిర్మాణానికి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్డు నిర్మాణం కావాలని నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు దృష్టికి తీసుకువచ్చారని, దీంతో రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రహదారి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి కావాలని సూచించారు. ఈ సందర్భంగా కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ రహదారి నిర్మాణంతో కనెక్టివిటీ పెరిగి గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సర్పంచ్ లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, ఉప సర్పంచ్ రాజు, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, తహసిల్దార్ ప్రసాదరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.






