- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక దర్శకుడిగా నా కెరీర్ మొత్తం ఇలాంటి క్షణాల కోసమే ఎదురుచూశా.. ఆదిత్య ధర్ ఎమోషనల్ పోస్ట్
రణ్‌వీర్ గొప్ప నటుడని తనకు ముందే తెలుసని, కానీ ఈ సినిమా ప్రయాణం ఆయనలోని నిజమైన కళాకారుడిని, ఆయన వెనుక ఉన్న గొప్ప మానవత్వాన్ని ప్రేమించేలా చేసిందని అన్నారు.

దిశ, సినిమా: నేడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ పుట్టినరోజు కావడంతో ఆయనతో ధురంధర్, ధురంధర్-2 వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన ఆదిత్య ధర్ సోషల్ మీడియా వేదికగా ఎంతో ఎమోషనల్ అవుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక నటుడిగా, అంతకంటే ఎక్కువగా ఒక మంచి మనిషిగా రణ్‌వీర్ సింగ్ తన మనసుకు ఎంతలా దగ్గరయ్యారో ఆదిత్య ధర్ వివరిస్తూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కొన్ని సినిమాలు మన జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాయని, తన కెరీర్‌లో 'ధురంధర్' ఖచ్చితంగా అలాంటి ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని ఆదిత్య ధర్ పేర్కొన్నారు. ఈ చిత్రం కేవలం ఒక కథ మాత్రమే కాదని, ఒక దర్శకుడిగా చాలా అరుదుగా చూసే ఒక అద్భుతాన్ని రణ్‌వీర్ రూపంలో తాను షూటింగ్ సమయంలో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. రణ్‌వీర్ గొప్ప నటుడని తనకు ముందే తెలుసని, కానీ ఈ సినిమా ప్రయాణం ఆయనలోని నిజమైన కళాకారుడిని, ఆయన వెనుక ఉన్న గొప్ప మానవత్వాన్ని ప్రేమించేలా చేసిందని అన్నారు.
ముఖ్యంగా సఇందులో వచ్చే 26/11 సన్నివేశం, పఠాన్‌కోట్ మారణకాండ, కోర్టు బయట వచ్చే సీన్లతో పాటు మరికొన్ని కీలక దృశ్యాలను చిత్రీకరించేటప్పుడు రణ్‌వీర్ ఎప్పుడూ సులువైన మార్గాన్ని ఎంచుకోలేదని ఆదిత్య ధర్ గుర్తుచేసుకున్నారు. టేక్ తర్వాత టేక్ ఇస్తూ, ప్రతి భావోద్వేగాన్ని ఎంతో పర్‌ఫెక్ట్‌గా పండించారని ప్రశంసించారు. అంతేకాకుండా రణ్‌వీర్ నటనను చూస్తుంటే సాక్షాత్తు ఆ సరస్వతీ దేవి తన తలపై చేయి ఉంచి, తన వద్దనున్న కళా నైపుణ్యంతో ఆశీర్వదించినట్లుగా అనిపించిందని చెప్పారు. ఒక దర్శకుడిగా తన కెరీర్‌లో అనుభవించాలనుకున్న అద్భుతమైన క్షణాల కోసమే ఎదురుచూసినట్లు.. అవి రణ్‌వీర్ తనకు పదే పదే అందించారని కృతజ్ఞతలు తెలిపారు. 'ధురంధర్' లో రణ్‌వీర్ చేసిన ప్రదర్శన, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ నటనలో ఒకటిగా నిలిచిపోతుందని ఆదిత్య ధర్ చెప్పారు. ఈ నటన గురించి రాబోయే తరాల వారు కూడా మాట్లాడుకుంటారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో యాక్షన్, కట్ మధ్య జరిగిన సంభాషణలు, ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం తన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. ఈ సినిమా ప్రయాణంలో రణ్‌వీర్ కేవలం తన నటుడిగా మాత్రమే కాకుండా.. తన సొంత సోదరుడిగా మారిపోయారని ఆదిత్య ధర్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.






