RTCతో చర్చలు విఫలం.. జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-06 11:20:43  IST  )

యాజమాన్యంతో జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని తెలిపారు...

RTCతో చర్చలు విఫలం.. జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: APSRTC యాజమాన్యంతో జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని తెలిపారు. విజయవాడలో ఆర్టీసీ ఈడీలతో భేటీ అయిన జేఏసీ నేతలు తమ డిమాండ్లను వినిపించారు. అయితే అక్కడ నుంచి సుస్పష్టమైన హామీ రాకపోవడంతో జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఉద్యమ కార్యచరణ కొనసాగిస్తామని తెలిపారు. కొన్ని సమస్యలైనా నెరవేరతాయన్న ఆశ నిరాశగానే మిగిలిందని అసహనం వ్యక్తం చేశారు. బస్సులను ప్రైవేటు పరం చేయొద్దని ఈడీలకు తెలిపినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈడీలు హామీ ఇచ్చారని తెలిపారు. మరో 10 రోజుల్లో తమతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు.

Next Story