క్షీణిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

by Malleboina Mahesh |

నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష చేస్తుండగా.. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీనిస్తోంది.

క్షీణిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన నీట్ (NEET UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన జ్వాలలు మిన్నంటాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న విద్యార్థుల ఆందోళనకు సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా తరలివచ్చి తన మద్దతు ప్రకటించారు.

తగ్గుతున్న బ్లడ్ షుగర్ లెవెల్స్

దీక్ష ప్రారంభించడానికి ముందు సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దిప్కేలు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. కేవలం ఉప్పు, నీటితోనే దీక్ష కొనసాగిస్తుండటంతో వాంగ్‌చుక్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. వైద్యుల పరీక్షల ప్రకారం ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ 66కు పడిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, నిరసన వేదిక వద్దకు విద్యార్థులు, రైతు సంఘాల నేతలు రాకుండా ఢిల్లీ పోలీసులు భారీగా బలగాలను మోహరించి ఆంక్షలు విధించారని CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద తాగునీరు, పారిశుద్ధ్య వసతులను కూడా నిలిపివేశారని, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల నుండి మద్దతుగా వస్తున్న పలువురు రైతు నాయకులను గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు.

Next Story