ప్రమాదంలో గ్రామ పంచాయతీ స్టార్టర్ బాక్స్

by velandi.Saikiran |

అమరగిరి గ్రామంలో ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర ఉన్న బోర్ మోటర్ నుంచి గ్రామానికి తాగు నీటినీ అందిస్తోంది.

ప్రమాదంలో గ్రామ పంచాయతీ స్టార్టర్ బాక్స్
X

దిశ, కొల్లాపూర్: మండల పరిధిలోని అమరగిరి గ్రామంలో ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర ఉన్న బోర్ మోటర్ నుంచి గ్రామానికి తాగు నీటినీ అందిస్తోంది. అయితే ఇక్కడ ఉన్న స్టార్టర్ డబ్బా తుప్పు పట్టి ఒక పక్క ఊడిపోయి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మోటార్ స్టార్టర్ బాక్స్ తుప్పుపట్టిపోయినా సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌నిగ‌ బీజేపీ నాయకుడు భరత్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. తుప్పు పట్టిన‌ స్టారర్ డబ్బా తొల‌గించి, గ్రామపంచాయతీ నిధులతో కొత్తదాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరారు.

Next Story