- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జవాన్ మహేశ్ పొలం విషయంలో ట్విస్ట్: కొన్నానంటున్న ఉషారాణి.. ఉద్రిక్తత
ఆర్మీ జవాన్ మహేశ్ పొలం వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. ఆ పొలాన్ని తాము కొనుగోలు చేశామంటూ ఉషారాణి అనే మహిళ తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: ఆర్మీ జవాన్ మహేశ్(Army Jawan Mahesh) పొలం(Farm) వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. ఆ పొలాన్ని తాము కొనుగోలు చేశామంటూ ఉషారాణి అనే మహిళ తెలిపారు. అంతేకాదు ఆ పొలాన్ని దున్నేందుకు ప్రయత్నం చేశారు. దీంతో జవాన్ మహేశ్ తండ్రి రామచంద్రుడు అడ్డుకున్నారు. తమ వద్ద పొలం కొంటే పత్రాలు చూపించాలంటూ నిలదీశారు. అయితే ఆ పొలం డాటెడ్ ల్యాండ్(Dotted land) కావడంతో తాము రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని ఉషారాణి అంటున్నారు. దీంతో నంద్యాల జిల్లా మహానంది సూర్యనంది ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు రెండు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉషారాణితో పాటు రామచంద్రుడితోనూ మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్మీ జవాన్ మహేశ్ ఆవేదనతో వెలుగులోకి..
కాగా నంద్యాల జిల్లా తమ్మడపల్లి గ్రామానికి సమీపంలో 2 ఎకరాల 38 సెంట్ల భూమి ఉందని, దాన్ని టీడీపీకి చెందిన వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, తన పొలాన్ని రక్షించాలని ఆర్మీ జవాన్ మహేశ్ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ఉన్న తనకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతలో ఆ పొలం వద్దకు ఉషారాణి వెళ్లి దున్నేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.






