తెలంగాణ అసెంబ్లీలో నూతన శకం: దేశంలోనే తొలిసారిగా

by Gantepaka Srikanth |

తెలంగాణ అసెంబ్లీలో నూతన శకం ప్రారంభమైంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటీకి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.

తెలంగాణ అసెంబ్లీలో నూతన శకం: దేశంలోనే తొలిసారిగా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో నూతన శకం ప్రారంభమైంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటీకి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలతో అసెంబ్లీ.. మండలి కార్యదర్శులు మీడియా అడ్వైజరీ కమిటి కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. అసెంబ్లీ అడ్వైజరీ కమిటీ కోసం ప్రత్యేకంగా దేశంలో ఏ అసెంబ్లీలో ప్రత్యేక కార్యాలయం లేదు. పార్లమెంట్‌లో కూడా ఇలాంటి వసతి ఏర్పాటు జరగలేదు. కానీ మొదటి సారి తెలంగాణ అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటీ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు జరిగింది.

మీడియా అడ్వైజరీ కమిటీ కార్యాలయం ఇవాళ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఎంపీ వేం నరేందర్ రెడ్డిలు ప్రారంభించారు. కమిటి చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో చైర్మన్ పరిపూర్ణ చారి. కమిటి సభ్యులు.. ఉదయం పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

Next Story