- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదలకు అండ.. కాంగ్రెస్ జెండా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తోడ్పాటుతో పేదలు కష్టాల నుంచి వైదొలిగి ఆత్మగౌరవంతో బతుకుతున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.

దిశ, ఆమనగల్లు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తోడ్పాటుతో పేదలు కష్టాల నుంచి వైదొలిగి ఆత్మగౌరవంతో బతుకుతున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ జెండా పేదలకు అండ అని ఆయన అన్నారు. మాడ్గుల,వెల్దండ, తలకొండపల్లి మండలాల్లో బుధవారం ఎమ్మెల్యే పర్యటించి వివిధ పథకాల కింద చేపడుతున్న పనులను పరిశీలించి నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించారు. సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పదకొండు చెక్కులను సోమవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యల పరిష్కారం, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనులు పై సమగ్రంగా చర్చించారు. ఎలాంటి పెండింగ్ పనులు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా ప్రజా దర్బార్ ద్వారా ఆయా మండలాల నుంచి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో కిషన్ రెడ్డి, వెంకటేశ్వర్లు గౌడ్, ఆనంద్, గూడూరు శ్రీనివాసరెడ్డి, యాట నర్సింహ, జగన్, అజీజ్, విద్యుత్ శాఖ ఏడీఈ, ఏఈ, ఆయా మండలాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






