- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కినేని నాగార్జున ‘కింగ్-100’లో ఊహించని ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా స్టార్ నటి!
ఈ సినిమాలో ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఉండబోతోందని టాక్. ఇందులో ఒక పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో టబు కనిపించబోతున్నారట.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైల్‌స్టోన్ మూవీ 'కింగ్ 100'. అయితే ఈ చిత్రంలో టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ మైల్‌స్టోన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టబు, సుస్మితా భట్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో నాగార్జున, టబు కాంబినేషన్‌లో వచ్చిన 'నిన్నే పెళ్లాడుతా' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. వీరిద్దరూ చివరిసారిగా 'ఆవిడా మా ఆవిడే' అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది.
చాలా కాలం తర్వాత ఈ సూపర్ హిట్ జంట మళ్లీ కలిసి నటిస్తుండటంతో, వెండితెరపై పాత రోజుల్లాంటి లవ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఉండబోతోందని టాక్. ఇందులో ఒక పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో టబు కనిపించబోతున్నారట. ఈ క్రేజీ ట్విస్ట్ ఇప్పుడు అక్కినేని అభిమానులను తెగ ఆశ్చర్యపరుస్తోంది. నాగార్జునను ఢీకొట్టే లేడీ విలన్‌గా టబు పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానుందని తెలుస్తోంది. పూర్తి ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో తండ్రి-కూతుళ్ల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన దాదాపు 80 శాతం షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని తెలుస్తోంది. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్.






