- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్యను లాంగ్ షెడ్యూల్‌కు రెడీ చేస్తున్న కొరటాల!
20 రోజుల పాటు బాలయ్యపై భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసిన కొరటాల

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం కొద్ది రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ఇప్పటివరకు కనిపించని వైవిధ్యమైన లుక్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూజా కార్యక్రమాలు పూర్తై కొన్ని రోజులు గడిచినా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఆగస్టు రెండో వారం నుంచి ఈ చిత్రం తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది.
మొదటి షెడ్యూల్‌లోనే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ యాక్షన్ షెడ్యూల్‌లో బాలకృష్ణతో పాటు పలువురు ఫైటర్స్, కీలక నటీనటులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో పవర్‌ఫుల్ యాక్షన్‌తో పాటు సమాజానికి ఉపయోగపడే బలమైన సందేశం కూడా ఉంటుంది. ఈ చిత్రంలోనూ అలాంటి మెసేజ్‌కు ప్రాధాన్యం ఉండనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ మరియు SLV సినిమాస్ బ్యానర్లపై నిర్మించనున్నారు.






