- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బు ఆశచూపి చిన్నారిని పొదల్లోకి రమ్మన్న నకిలీ బాబా! బాలిక ఒక్క అరుపుతో కథ మారిపోయింది (వీడియో)
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆడుకుంటున్న ఓ చిన్నారికి డబ్బు, సైకిల్ ఆశచూపి తీసుకెళ్లేందుకు యత్నించిన ఓ నకిలీ బాబా (స్వయం ప్రకటిత బాబా) ఆటను ఆ బాలిక తన ధైర్య సాహసాలతో కట్టడి చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆడుకుంటున్న ఓ చిన్నారికి డబ్బు, సైకిల్ ఆశచూపి తీసుకెళ్లేందుకు యత్నించిన ఓ నకిలీ బాబా (స్వయం ప్రకటిత బాబా) ఆటను ఆ బాలిక తన ధైర్య సాహసాలతో కట్టడి చేసింది. స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో, జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. రిషికేశ్ పరిధిలోని దేవ్ నగరి ప్రాంతంలో సాయంత్రం వేళ కొంతమంది ఆడపిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఇంతలో కాషాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. ఓ చిన్నారి వద్దకు వెళ్లి.. తనతో పాటు నదికి అవతలి వైపు ఉన్న పొదల్లోకి వస్తే రూ. 1,200 నగదుతో పాటు, కొత్త సైకిల్ కొనిస్తానని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడని ఆరోపణలు వినిపించాయి.
బాలిక ధైర్యం, స్థానికుల దేహశుద్ధి
ఆ వ్యక్తి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ బాలిక ఏమాత్రం భయపడకుండా అతడిని నిలదీసింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారిని అప్రమత్తం చేసి, జరిగిన విషయాన్ని వివరించింది. అక్కడికి చేరుకున్న స్థానికులు ఆ నకిలీ బాబాను చుట్టుముట్టి నిలదీశారు. అతడి తీరుపై మండిపడుతూ తుక్కుతుక్కుగా కొట్టారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి నేపథ్యంపై విచారణ చేపట్టారు. అయితే వీడియోలో వినిపిస్తున్న ఆరోపణలు అధికారికంగా ఇంకా ధృవీకరించబడలేదని, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాగా, ఆపద సమయంలో బాలిక ప్రదర్శించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని నెటిజన్లు తీవ్రంగా ప్రశంసిస్తున్నారు.






