మొబైల్ యూజర్లకు షాక్.. త్వరలోనే భారీగా పెరగనున్న టారిఫ్స్!

by Prasad Jukanti |

మొబైల్ వినియోగదారులపై మరో ఆర్థిక భారం పడనుంది. రాబోయే 3-4 నెలల్లో టెలికాం ఛార్జీలు 12-15 శాతం పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ నివేదిక వెల్లడించింది.

మొబైల్ యూజర్లకు షాక్.. త్వరలోనే భారీగా పెరగనున్న టారిఫ్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మొబైల్ వినియోగదారుల నెత్తిన మరో పిడుగు పడనుంది. భారతీయ టెలికాం రంగంలో రాబోయే మూడు నుండి నాలుగు నెలల్లో మొబైల్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని 'సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్' (Centrum Institutional Research) తాజా నివేదికలో అంచనా వేసింది. మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత ధరలు పెంచడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడటమే దీనికి కారణమని ఆ సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఇప్పటికే సగటు మానవుడు ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు మొబైల్ రీచార్జి కూడా మరింత ప్రియం కానుండటం సామాన్యుల బతుకులపై ఆర్థిక భారంగా మారనుంది.

12-15 శాతం వరకు పెరిగే చాన్స్:

సామాన్యులకు షాక్ ఇస్తూ ఈ సారి ఏకంగా 12-15 శాతం వరకు టారిఫ్స్ పెరిగే అవకాశం ఉందని ఈ సంస్ధ అంచనావేసింది. ప్రస్తుతం మార్కెట్లో కేవలం 3 ప్రైవేట్ + 1 ప్రభుత్వ (BSNL) ఆపరేటర్లు మాత్రమే ఉన్నారని, అందువల్ల రాబోయే 3-4 ధరల పెంపు ఉండే అవకాశం ఉందని ఈ బ్రోకరేజ్ సంస్థ తన Q1FY27 టెలికాం అండ్ ఇంటర్నెట్ సెక్టార్ ప్రివ్యూ నివేదికలో తెలిపింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల 'వినియోగదారుడి సగటు ఆదాయం' (ARPU) త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) 1-1.5 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. వినియోగదారులు 2G నుండి 4G, 5G నెట్‌వర్క్‌లకు మారడం, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల సంఖ్య పెరగడం మరియు ఈ త్రైమాసికంలో ఎక్కువ రోజులు ఉండటం దీనికి కారణాలని పేర్కొంది.

పెంపుపై కంపెనీల వ్యూహాలు:

నిజానికి గత కొంత కాలంగా టారిఫ్ ల ధరలు పెంచేందుకు టెలికాం సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి. G సేవలను ఉచితంగా అందించడం వల్ల కంపెనీలు ఆశీంచినంత లాభాల్లో లేవని తాము పెట్టిన భారీ పెట్టుబడులను తిరిగి రికవరీ చేసుకోవడంతో పాటు, ప్రతి కస్టమర్ నుండి వచ్చే సగటు ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలనే వ్యూహాత్మక ప్రణాళికతోనే ఈ టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలు సవరించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ సైతం పెంపు ఉండబోతోందనే అంచనా ఇప్పుడు మొబైల్ యూజర్ల వెన్నులో వణుకు పుట్టించేలా మారింది.

Next Story