- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Red Alert : ముంబై, థానేలకు రెడ్ అలర్ట్.. హెచ్చరించిన భారత వాతావరణ శాఖ
ముంబై, థానే, రాయ్‌గఢ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబై, థానే, రాయ్‌గఢ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను ‘రెడ్ అలర్ట్’గా మార్చడంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్‌డీఎంఏ) పలు కీలక సూచనలు జారీ చేసింది.
ఉద్యోగులకు వెసులుబాటు..
ముంబై వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వీలైనంత వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సదుపాయం కల్పించాలని ఎస్‌డీఎంఏ సూచించింది. అత్యవసర విభాగాలు మినహా ఇతర ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యాహ్నం తర్వాత సెలవు (హాఫ్-డే) ప్రకటించింది. గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పాత భవనాలు దెబ్బతినడం, భారీ వృక్షాలు నేలకూలడం వంటి ముప్పు ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
మంత్రి గిరీశ్ మహాజన్ విజ్ఞప్తి
మహారాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ మాట్లాడుతూ.. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ముఖ్యంగా విహారయాత్రలకు (టూరిజం) వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, కళాశాలల మూసివేతపై త్వరలో అధికారిక ప్రకటన చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయవద్దని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. ప్రాజెక్టులు, డ్యామ్‌లలో నీటి మట్టాలు ఆశాజనకంగా పెరగడానికి మరో మూడు నాలుగు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురవాల్సి ఉందన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని కిష్టవార్‌లో క్లౌడ్‌బరస్ట్.. బురద కింద చిక్కుకుపోయిన వాహనాలు (వీడియో)






