దిశ కథనానికి స్పందించిన సర్పంచ్..

by Kodari Anjali |

వర్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి దుస్థితిపై దిశలో ప్రచురితమైన కథనానికి గ్రామ సర్పంచ్ జయభారతి స్పందించారు.

దిశ కథనానికి స్పందించిన సర్పంచ్..
X

దిశ, వర్గల్: వర్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి దుస్థితిపై దిశలో ప్రచురితమైన కథనానికి గ్రామ సర్పంచ్ జయభారతి స్పందించారు. రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమె ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు కూడా దీక్షకు మద్దతు తెలుపుతూ.. రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షుడు నాగరాజు, వార్డు సభ్యులు మోసిన్, పరుశురాం, స్వామి, కిష్టారెడ్డి, వెంకట్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story