- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుర్ధాపూర్లో పోడు ఉద్రిక్తత..
by Kodari Anjali |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సుర్దాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

X
దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సుర్దాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కెరమెరి ఫారెస్ట్ రేంజ్ దేవుడుపల్లి బీట్ పరిధిలోని సుర్ధాపూర్ గ్రామ శివారులో 100 రైతులకు సంబంధించిన సాగు భూములను అటవీశాఖ భూముల పేరిట అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం పోడు రైతులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రైతులు అటవీ పోలీస్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. నిరసన తెలపడానికి వచ్చి తమపై పోలీసులు కొట్టే ప్రయత్నం చేయగా మహిళలకు గాయాలయ్యాయని రైతులు ఆరోపించారు. 50 ఏళ్లుగా ఈ భూములను సాగు చేస్తున్నామని. మా జీవనాధారం ఈ భూములేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములను తిరిగి అప్పగించాలని రైతులు డిమాండ్ చేశారు.
Next Story






