సీఎన్జీ గ్యాస్ కోసం తిప్పలు.. నేషనల్ హైవే 163 పై ఒకే ఒక్క స్టేషన్

by Kodari Anjali |

సీఎన్జీ గ్యాస్ కోసం వాహనాదారులు ముప్పు తిప్పలు పడుతున్నారు.

సీఎన్జీ గ్యాస్ కోసం తిప్పలు.. నేషనల్ హైవే 163 పై ఒకే ఒక్క స్టేషన్
X

దిశ, చేవెళ్ల: సీఎన్జీ గ్యాస్ కోసం వాహనాదారులు ముప్పు తిప్పలు పడుతున్నారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో హైదరాబాద్-బీజాపూర్-లంగర్ హౌస్, తెలంగాణ పోలీస్ అకాడమీ, అజిత్ నగర్, మొయినాబాద్, చేవెళ్ల, పూడూరు వరకు ఒకే ఒక్క సీఎన్జీ గ్యాస్ స్టేషన్ ఉండడంతో నిరంతరం గంటల తరబడి వాహనదారులు క్యూలో ఉంటున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలను నిలిపి ఉంటున్నాయి. నిత్యం ఈ రహదారిపై రాష్ట్ర రాజకీయ ప్రముఖులు పర్యటిస్తుంటారు. కానీ మీరు ఎవరికి పట్టదు. నేషనల్ హైవే 163 పై ఓకే ఒక్క స్టేషన్ ఉండడంతో సమస్య తీవ్రంగా ఉంది. అజీజ్ నగర్ సమీపంలో గ్యాస్ స్టేషన్ ఉండడంతో హైదరాబాద్ శివారు ప్రాంత వాహానాదారులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రాంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ నేషనల్ హైవేపై మరిన్ని గ్యాస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ నెలకొంది. మరిన్ని గ్యాస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉండడంతో పెట్రోల్ బంక్ యజమానులు ఆ దిశగా ఆలోచనలు చేస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. సిఎన్జి స్టేషన్లో కొరతను ఆసరాగా చేసుకుని ఉన్న ఒక అజిజ్ నగర్ స్టేషన్లో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 8 కేజీ సిలిండర్ నింపుకొవడానికి మూడు గంటల పైగానే సమయం పడుతుంది.

టాక్సీ వాహనాలకు సీఎన్జీ గ్యాస్ సమస్య

ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా లో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు సీఎన్జీ (CNG) కొరత పెద్ద సమస్యగా మారింది. సీఎన్జీ సెంటర్లు ఎక్కువగా లేకపోవడంతో గ్యాస్ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలవాల్సి వస్తుంది. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం పడిపోతోంది. ఆటోలు, క్యాబ్ లు, సొంత వాహనాల యాజమానులు గంటల తరబడి క్యూ కడుతున్నారు. దీంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారుతోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ వద్ద ఉన్నా హిందూస్థాన్ పెట్రోలియం (హెచ్ పీ ) వద్ద వాహనాలు బారులు తిరుతున్నాయి. తెలంగాణ పోలీస్ అకాడమీ నుండి దగ్గర లోనే ఇదీ ఉండడంతో నగర శివారు ప్రాంతంలో ఉన్న వాహన యాజమానులు ఇక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం ఈ రహదారి 163 నేషనల్ హైవే గా రూపుదిద్దుకుంది. రానున్న రోజుల్లో సీ ఎన్ జీ సమస్య మరింత తీవ్రంగా ఏర్పడనుందని వాహనదారులు అంటున్నారు.

సమయం వృథా..

సీఎన్‌జీ పంపుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. ట్యాంక్ నింపడానికి 3 నుండి 6 గంటల సమయం పడుతుండటంతో, డ్రైవర్లకు ప్రయాణాలు దొరకడం లేదు.

ఆర్థిక భారం

రోజువారీ సంపాదనలో సగం సమయం గ్యాస్ కోసమే ఖర్చవుతోంది. డెలివరీ, క్యాబ్ బుకింగ్ సేవలు చాలావరకు తగ్గిపోయాయి. మరోవైపు సీఎన్‌జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. అదనపు వసూళ్లు చేయడం పై మండి పడుతున్నారు. గ్యాస్ దొరకక డ్రైవర్లు ఇబ్బంది పడుతుంటే, కొన్ని కేంద్రాల్లో అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పరిష్కారాలు డిమాండ్లు

ఈ గ్యాస్ కష్టాలపై Telangana Gig and Platform Workers Union ప్రభుత్వానికి ఇప్పటి కే విజ్ఞప్తి చేసింది.స్టాక్ కూడా పెంపు చెప్పటాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎన్‌జీ పంపుల వద్ద సరఫరాను పెంచి, త్వరితగతిన గ్యాస్ అందేలా చూడాలని కోరుతున్నారు.

రేట్ల సవరణ

క్యాబ్ అగ్రిగేటర్లు ప్రయాణ ఛార్జీలను పెంచాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ 163 నేషనల్ హైవే పై మరిన్ని సీఎన్జీ గ్యాస్ స్టేషన్లో ఏర్పాటు చేయాలని స్థానికుల నుంచి డిమాoడ్ చేస్తున్నారు. అయితే శంకర్ పల్లి పట్టణంలో ఒకటి, మిర్జాగూడ వద్ద ఒకటి సిఎన్జి గ్యాస్ స్టేషన్లో ఉన్నాయి. వాటి పైన కూడా ఓవర్ లోడు పడుతుంది. వాహనదారులు అక్కడ కూడా గంటల తరబడి క్యూలు కడుతున్నారు. కొనిస్ట్రేషన్లలో కరెంట్ లేదని షాక్‌తో గ్యాస్ సీఎన్జీని నింపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా తయారైంది.

Next Story