- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం: సముద్రంలో మునిగి నిజామాబాద్ వాసి మృతి
బహ్రెయిన్ జరిగిన ఒక విషాద సంఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: బహ్రెయిన్ జరిగిన ఒక విషాద సంఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. స్థానిక దుర్రత్ అల్ బహ్రెయిన్ (Durrat Al Bahrain) సముద్ర తీరంలో మునిగి నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం 2019లో బహ్రెయిన్ వెళ్లారు. అక్కడ ప్రముఖ 'ఎంఏసీ' (MAC) సంస్థలో గత ఏడేళ్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దుర్రత్ అల్ బహ్రెయిన్ తీరానికి వెళ్లిన ఆయన, ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి మరణించారు. శ్రీనివాస్ మృతి చెందిన విషయాన్ని సదరు కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులకు అధికారికంగా సమాచారం అందించారు. శ్రీనివాస్ అకాల మరణంతో ఆయన స్వగ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
ప్రభుత్వ సహాయం కోసం కుటుంబ సభ్యుల వేడుకోలు..
ఆర్థికంగా ఆసరాగా ఉంటాడనుకున్న ఇంటి పెద్ద దూరమవ్వడంతో శ్రీనివాస్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. బహ్రెయిన్‌లో ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా చొరవ చూపాలని బాధితుడి కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, అలాగే గల్ఫ్ కార్మిక సంక్షేమ శాఖను కన్నీటితో అభ్యర్థిస్తున్నారు.






