- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేట్ ఆఫీసుల్లో లేని గొడవ ఇండస్ట్రీలోనే ఎందుకు? పనిగంటల వివాదంపై కాజల్ సెన్సేషనల్ కామెంట్స్
ఆదివారాలు తాను అస్సలు షూటింగ్‌లలో పాల్గొననని, ఆ సమయాన్ని పూర్తిగా తన కుమారుడితో గడపడానికే కేటాయిస్తానని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినిమా పరిశ్రమలో పని గంటల విషయంలో పెద్ద చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేసేలా నిబంధనలు ఉండాలంటూ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె చేసిన డిమాండ్‌కు కొంతమంది యంగ్ హీరోయిన్స్ సైతం సపోర్ట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా దీపికా పదుకొణె పలు భారీ ప్రాజెక్ట్స్ కూడా కోల్పోయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. నిరాశ చెందకుండా దర్శకనిర్మాతలకే కండిషన్లు పెడుతూ అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. 8గంటల పని తర్వాత తన కూతురుతో సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా, ఈ విషయంపై టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పూర్తి మద్దతు ప్రకటించారు. తాను తల్లి అయినప్పటి నుంచి తన కెరీర్‌లో కూడా ఇలాంటి నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నానని ఆమె వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోని పని గంటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సైన్ చేసే ప్రతి సినిమా కాంట్రాక్ట్‌లోనే ఫిక్స్‌డ్ వర్కింగ్ అవర్స్ ఉండేలా చూసుకుంటానని చెప్పారు.
అంతేకాకుండా, ఆదివారాలు తాను అస్సలు షూటింగ్‌లలో పాల్గొననని, ఆ సమయాన్ని పూర్తిగా తన కుమారుడితో గడపడానికే కేటాయిస్తానని స్పష్టం చేశారు. ఇది చాలా చిన్న విషయమని, దీనిపై ఇంత చర్చ జరగాల్సిన అవసరం లేదని కాజల్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ రంగంలో లేదా ఆఫీసుల్లో రోజుకు 8 గంటల పని విధానాన్ని అందరూ సాధారణంగా అంగీకరిస్తారని, మరి సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి దీనిపై ఎందుకు అంతలా చర్చలు, వాదనలు జరుగుతాయో అర్థం కావడం లేదని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ విషయంలో దీపికా పదుకొణెకు వందకు వంద శాతం మద్దతు ఇస్తున్నాను అని కాజల్ చెప్పారు. నటీనటులు తమ కెరీర్‌లో ఒక మంచి స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడతారని, ఆ స్థాయికి వచ్చాక తమ వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.






