- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలి
బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారీ తిరుపతి కోరారు.

దిశ, పెగడపల్లి : మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారీ తిరుపతి కోరారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కడారీ తిరుపతి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చెట్ల కిషన్, లింగంపల్లి మహేష్,చాట్ల విజయ్ భాస్కర్,బాలుసాని శ్రీనివాస్ గౌడ్,మాజీ మండల అధ్యక్షుడు ఆకుల విష్ణు,నాయకులు ఓరుగలి శ్రీనివాస్,బండారి శ్రీనివాస్,పూసల తిరుపతి,హనుమాన్ శేఖర్,దికొండ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.






