- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరో రోజుకు చేరిన ‘రైతు భరోసా’.. 7 ఎకరాల రైతులకు నిధులు విడుదల
తెలంగాణలో వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి రైతుభరోసా నిధుల జమ ఆరో రోజుకు చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఆరు రోజులో భాగంగా ఇవాళ రాష్ట్రంలోని 7 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను సర్కార్ విడుదల చేసింది. 92,729 మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.354.96 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో నేరుగా జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. మార్కెట్‌లో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్న సమయంలో ప్రభుత్వ పెట్టుబడి సాయం అందడంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరకు పెట్టుబడి సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 124.85 ఎకరాలకు గాను రూ.7,490.72 కోట్లు జమైనట్లుగా అధికారులు వెల్లడించారు.






