సెన్సార్ పూర్తి చేసుకున్న ఐశ్వర్య రాజేష్ ‘ఓ సుకుమారి’ సినిమా..

by Mallepaka Hamsa |

‘ఓ సుకుమారి’ సినిమా తన సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఐశ్వర్య రాజేష్ ‘ఓ సుకుమారి’ సినిమా..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ , టాలెంటెడ్ హీరో తిరువీర్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక చక్కటి రూరల్ రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా ముగించే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

‘ఓ సుకుమారి’ సినిమా తన సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సినిమాలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్, యూత్‌కు నచ్చే రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు ఆకట్టుకునే ఫాంటసీ అంశాలు ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెన్సార్ అడ్డంకులు కూడా తొలగిపోవడంతో ఈ సినిమాను జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ‘మసూద’, ‘పరేషాన్’ లాంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, వైవిధ్యమైన కథలను ఎంచుకునే ఐశ్వర్య రాజేష్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Next Story