కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లు బదిలీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-06 07:08:39  IST  )

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లు బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో పరిపాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాలకు ఓఎస్డీలు (OSD), అదనపు ఎస్పీలను (Additional SP) నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవజ్యోతి మిశ్రా నియమితులయ్యారు. రాజమహేంద్రవరం రాజమండ్రి అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్‌ దేవ్‌‌రాజ్‌ బదిలీ అయ్యారు. పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మందా జావలి అల్ఫోన్స్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. అమరావతి ఓఎస్డీ లా అండ్ ఆర్డర్‌గా మనోజ్‌ రామనాథ్‌ హెగ్డే నియమితులయ్యారు. ఇక పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్‌ కుమార్‌ చౌదరి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడంలో భాగంగానే ఈ బదిలీలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మీరు వేట మొదలుపెట్టారు.. ప్రజలు ముగిస్తారు: ప్రకాశ్‌రాజ్ సంచలన వీడియో

Next Story