రోడ్డు ప్రమాదంలో వలస కూలీకి గాయాలు.. పరిస్థితి విషమం

by Kodari Anjali |

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో వలస కూలికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో వలస కూలీకి గాయాలు.. పరిస్థితి విషమం
X

దిశ, భూదాన్ పోచంపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో వలస కూలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జిబిఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చేదేళ్ల గ్రామానికి చెందిన సప్పిడి కేశవులు (50) మరికొందరు కూలీలతో కలిపి వరి నాట్లు వేయడానికి వచ్చాడు. సాయంత్రం పని ముగించుకొని పట్టణ కేంద్రానికి వచ్చి కూరగాయలను కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళుతుండగా జిబిఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయం కావడంతో తల, చెవులో నుండి తీవ్ర రక్త స్రావం అయ్యింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల వివరాలను తెలుసుకున్నారు. గాయపడ్డ కేశవులను హుటాహుటిన అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం హైదరాబాద్ బోడుప్పల్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.కేశవులు భార్య సప్పిడి వెంకటరమణ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Next Story