Video Viral: పట్టపగలే ఆర్టీసీ బస్సు బీభ‌త్సం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-19 11:38:59  IST  )

పట్టపగలే ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించిన ఘటన కరీంనగర్ జిల్లా (Karimnagar District)లో చోటుచేసుకుంది.

Video Viral: పట్టపగలే ఆర్టీసీ బస్సు బీభ‌త్సం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టపగలే ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించిన ఘటన కరీంనగర్ జిల్లా (Karimnagar District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Hyderabad) నుంచి కరీంనగర్ (Karimnagar) వెళ్తున్న ఆర్టీసీ బస్సు తిమ్మాపూర్ (Thimmapur) మండలం రేణికుంట (Renikunta) సమీపంలోని టోల్‌గేట్ (Toll Gate) సమీపంలోకి చేరుకుంది. ఈ క్రమంలోనే ఎదురుగా ఉన్న కారును తప్పించబోయిన బస్సు డ్రైవర్ ఏకంగా ఆ కారును అతివేగంతో బలంగా ఢీకొట్టాడు. అయితే, ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం అద్దాలతో సహా పూర్తిగా ధ్వంసమైంది. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం‌తోనే ప్రమాదం జరిగినట్లుగా టోల్‌గేట్ వద్ద ఉన్న సిబ్బంది తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ, ప్రమాదానికి సంబంధించి బస్సు డ్యాష్ బో‌ర్డ్ కెమెరా (Bus Dashboard Camera)లో రికార్డ్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది.

Click For Tweet Post..

గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జంట!

Next Story